అవినీతికి పాల్పడే వారు దైవాన్ని సైతం ఖాతరు చేయడం లేదు.. కేవలం – అక్రమార్జనే ద్యేయంగా సాగుతున్నారు. జగన్మాత కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు.. భక్తులు విస్తుపోయేలా అక్రమ దందా నడిపిస్తున్నారు..
- సికింద్రాబాద్ లో పెట్రేగిపోతున్న అక్రమార్కులు..
- శతాబ్దాల చరిత్ర ఉన్న కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం అక్రమంగా కూల్చివేత..
- ప్రేక్షక పాత్రలో ఎండోమెంట్ అధికారులు..
- ఈరోజుకు కూడా నమోదు కాని పోలీస్ కేసు..
- పక్కనే ఉన్న ఎస్టేట్ భూమిలో అడ్డగోలు నిర్మాణాలు చేస్తున్న కబ్జాకోర్లు..
- అవినీతి మత్తులో జోగుతున్న ఎస్టేట్ ఆఫీసర్..
- సీబీ సిఐడి విచారణతో పాటు, అధికారుల అవినీతిపై ఎంక్వైరీ జరపాలి..
- భారీ ఎత్తున ముడుపులు తీసుకొని పరోక్ష సహకారం అందిస్తున్న ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్..
- ప్రైవేటు గుడి అంటూ బుకాయిస్తున్న అవినీతి అధికారి..
- ఎస్టేట్ భూమిని రక్షించి, గుడి కూల్చిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి..!
సికింద్రాబాద్ ఏరియాలోని ఆవుల మంద శివారులో కన్యకా పరమేశ్వరి పురాతన ఆలయం నెలకొని ఉంది.. కాసుల కక్కుర్తి పడి కొంత మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ యొక్క పురాతన గుడిని కూల్చి వేయడంతో ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.. ఎండో మెంట్ కార్యాలయం ఆధీనంలో ఉన్న ఈ గుడిని ఎలాంటి అను మతులు లేకుండా కూల్చి వేసింది దళారి ముఠా.. తిరిగి గుడి నిర్మాణం పేరుతో భక్తుల నుంచి అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా వారికి వారే వేసుకున్న కమిటీ..
ప్రభుత్వం ఆమోదించిన కమిటీ లాగా కలరింగ్ ఇస్తూ.. అక్రమ సంపాదన కోసం నూతన గుడి నిర్మాణం చేపడుతున్నామని అడ్డదారిలో డబ్బులు వసూలు చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తు న్నాయి.. ఇంత జరుగుతున్న ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గుడిని కూల్చివేయడంపై ఎండోమెంట్ అధికారులు అక్రమార్కులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

అక్రమ కూల్చివేతకు మౌనంగా సమ్మతి? :
గుడి కూల్చివేత జరిగిన సమయంలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న ఎండోమెంట్ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడమే తప్ప, ఎలాంటి చర్యలు చేయకపోవడంతో సదరు అధికారి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని ఆ వైపు కెన్నెత్తి చూడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.. చట్ట బద్దంగా రక్షించాల్సిన ఆలయాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. భారీ ఎత్తున ముడుపులు తీసుకొని సంబంధిత అధికారి అక్రమార్కులకు అంట కాగుతున్నాడని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు..
ఇదే విషయంపై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ను వివరణ కోరగా అది ప్రైవేటు గుడి అని, తనకు సంబంధం లేదని బుకాయించాడు.. ప్రైవేటు గుడి అయితే ఎండోమెంట్ రికార్డులో ఎలా నమోదయింది అన్నది ప్రశ్న..? ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారని అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అక్రమాలకు ఆజ్యం పోస్తూ.. సదరు అధికారి అవినీతి చేస్తున్నారు అన్న ఆరోపణకు బలం చేకూరుతుంది.. ఈ అక్రమ వ్యవహారంలో అక్రమార్కుల కండగా నిలిచిన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ వ్యవహారంపై విజిలెన్స్, ఏసీబీ, సిబిసిఐడి విచారణ జరపాలని.. ఇంకా అధికారులు విచారణ చేస్తే వాస్తవాలు బట్టబయలు అవుతాయని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు..
ఎస్టేట్ భూమిపై అక్రమ నిర్మాణాల పండుగ :
గుడి కూల్చివేత అనంతరం దీనికి అనుకోని ఉన్న ఎస్టేట్ భూమిపై దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపట్టి కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కొల్లగొడుతున్నారని తెలిసింది.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కోట్ల విలువైన నిర్మాణాలు కొనసాగుతున్నా, ఎస్టేట్, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తుల పై చర్యలు చేపట్టకపోవడం వెనుక అమ్యమ్యాల వ్యవహారం నడిచిం దని ఆరోపణలు వినిపిస్తున్నాయి..
కన్యకాపరమేశ్వరి గుడి పేరు తో అడ్డగోలుగా భక్తిని సాకుగా చూపుతూ అక్రమంగా దోచుకుని సొమ్ము చేసుకోవచ్చని, కొంతమంది రిజిస్ట్రేషన్ శాఖ అధికారి కమిటీని నిర్ధారించినట్లు కలరింగ్ ఇస్తూ.. అడ్డగోలు సంపాదన కు తెగబడుతున్నారని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.. కళ్లెదుటే ఇంత భారీ దురాక్రమణ జరుగుతున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడం ఏంటని దుమ్మెత్తి పోస్తున్నారు స్థానిక ప్రజలు.. ఇప్పటికైనా ఈ యొక్క గుడి కూల్చివేతపై.. దీని వెనక ఉన్న స్థానిక బడా నాయకుడి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి, ఇతగాడి అక్రమాలకు కళ్లెం వేసి, అన్యాక్రాంత మవుతున్న ఎస్టేట్ భూమిని పరిరక్షించాలని భక్తులు, ప్రజా సంఘాలవారు డిమాండ్ చేస్తున్నారు.
ఈయొక్క గుడి పరిరక్షణకు ప్రత్యేక అధికారిని నియమించి ఆ అధికారి పర్యవేక్షణలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలని భక్తులు వేడుకుంటున్నారు.. బాధ్యులైన అధికారులపై తక్షణ చర్యలు చేపట్టి, మరోచోట ఇలాంటి సంఘటన జరగ కుండా ప్రభుత్వం చొరవ చూపాలని స్థానికులు కోరుకుం టున్నారు.. కన్యకా పరమేశ్వర్ గుడి పేరుతో ఇప్పటికే దాదాపు 16 కోట్ల రూపాయలు చందాల రూపంలో వసూలు చేసి ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారనే చర్చలు సైతం వినిపిస్తున్నాయి.
కాగా గుడి పేరుతో అక్రమంగా సొమ్ము చేసుకోవాలని చూస్తున్న వ్యక్తులకు కాస్త కళ్లెం పడ్డట్టు తెలిసింది.. స్థానిక వ్యక్తి హైకోర్టులో వేసిన కేసులో సైతం కన్యకా పరమేశ్వరి ఆలయం యధాస్థితిలో ఉండాలని, ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకుండా అలాగే ఉంచాలని తీర్పును సైతం ఇచ్చిందని తెలిసింది. రిజిస్ట్రేషన్ల శాఖ కమిటీని ఆమోదించక ముందే ఆతృతంగా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన బ్యాంకు మేనేజర్ సైతం ఈ యొక్క కమిటీలో అవినీతికి భాగస్వామి అయ్యాడని తెలిసింది..
ఎవరా బ్యాంకు మేనేజర్..? చట్టాలకు విరుద్ధంగా గుడి పేరుతో దొడ్డిదారిన అకౌంటు ఎలా ఓపెన్ చేశాడు..? డబ్బులు వసూలు చేయడంలో ఇతగాడి పాత్ర ఏ మేరకుంది అన్న విషయాలకు సం బంధించి.. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి కన్యకాపరమేశ్వరి గుడికి కమిటీగా ఎవరు ఉన్నారన్న విషయాలకు సంబంధించి మరో కథ నం ద్వారా వాస్తవాలను ఆధారాలతో సహా వెలుగులోకి తేనుంది ‘ఆదాబ్ హైదరాబాద్’ ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..
