Wednesday, March 4, 2026
Homeనల్లగొండబీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కడబుల్ ఇల్లు ఇవ్వలేదు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కడబుల్ ఇల్లు ఇవ్వలేదు

  • రెండెళ్ళ పాలనలో పధకాలు అందిస్తున్న ప్రజా ప్రభుత్వం
  • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

దశాబ్దం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేక పోయిందని సర్పంచ్ ఫోరం అద్యక్షుడు కాటం వెంకటేషం విమర్శించారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 9వ వార్డులో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఏర్పుల పరమేష్ అభ్యర్థిని గెలంపించవల్సిందిగా ఓటర్లను కోరారు.అధికారంలో ప్రజా ప్రభుత్వం ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వార్డు ప్రజలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News