రాంపల్లి దయారా వెంకులోని గుట్టలో వెలసిన శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షణ ఆదివారం వైభవంగా నిర్వహించారు. మాఘ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శుభప్రదం, ఫలప్రదం, మరియు స్వామివారి ఆశీస్సులకు అనుకూలమైన రోజు అని వేదోత్తములైన ఆదిత్య శర్మ, ఆంజనేయ శర్మ, శ్రీనివాస్ శర్మ మార్గదర్శనంలో నిర్ణయించబడిన సమయానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి గిరి ప్రదక్షణ నిర్వహించారు. హేమాద్రి వెంకటేశ్వర స్వామి సేవలో స్థానిక కీసర పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో మోస్తూ అత్యంత భక్తితో స్వామి నామస్మరణతో, భక్తి గీతాలతో, భజన పాటలతో, ఆడుతూ పాడుతూ పునర్నిర్మాణానికి ఇతోధికంగా సహకరిస్తున్న ధర్మదాతలు మరియు రాంపల్లి దయారా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ కందాడి హనుమంత రెడ్డి మాట్లాడుతూ ఇక నుండి ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉదయం 5 గంటలకు గిరి ప్రదక్షణ ఉంటుందని, కావున పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి సేవలో పాల్గొని ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లు కామసాని బాల్‌రెడ్డి, గరుగుల మల్లేష్, జాయింట్ సెక్రెటరీ గాడి రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ పురుషోత్తం రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు ద్యాగాల సుధాకర్, వరగంటి నగేష్, బిట్ల గంగ సముద్రం, చొక్కపురం శ్రీ రాములు, గురుగుల బాలనర్సింహా, గోక బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.
