Friday, February 27, 2026
Homeరంగారెడ్డిDiscrimination | దళితుల గుడికి దారేది

Discrimination | దళితుల గుడికి దారేది

మండలపరిధిలోని నాగరగూడ గ్రామపంచాయతీ సర్వేనెంబర్ 277లో దేవుడి గుడికి దారి వివాదంలో కులవివక్ష అగ్గిరాజేసింది. రెండు వర్గాలమధ్య నాలుగు రోజులుగా వివాదం కులచిచ్చు రేపుతుంది. తమకు న్యాయం చెయ్యాలని దళితులు, ప్రజాసంఘాలు, కులసంఘాలతో కలిసి ఎమ్మార్వో, ఆర్డివోలకు పిర్యాదు చేశారు. ఈ వివాదం చిలిగి చిలిగి గాలివానలా పెరిగి పెద్దదయ్యింది. దీంతో శనివారం రెండువర్గాలతో ఎంఆర్ఓ, సీఐ లు మాట్లాడి సమస్యపరిష్కారానికి ప్రయత్నం చేశారు.

సమాధుల మధ్యనుండి దళితులు కోరుతున్న దారికి ప్రత్యామ్నాయంగా పక్కనుండి దారి కల్పిస్తామని దళితులకు చెప్పాగా, కాని వారు నిరాకరించారు. అధికారులు చూపించిన మరో దారి భవిష్యత్తులో వివాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బీసీ వర్గానికే అనుకూలంగా వ్యవహారించారని అన్నారు. చివరికి దళితుల దేవుళ్ళకు దారి కూడా దొరకదా.. అంటూ ఆందోళన చేశారు.

- Advertisement -

ప్రభుత్వం కేటాయించిన స్మశానవాటిక దళితులకేనా?….

రానున్న రోజుల్లో స్మశానవాటికలకు భూమి సరిపోదనే ఉద్దేశ్యంతో కోట్లరుపాయలతో అన్నివర్గాల ప్రజల అవసరనిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికో స్మశానవాటిక అభివృద్ధి చేసింది. కాని గ్రామాలలో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే తరహాలో నాగరగూడ

సమస్య. నాగరగూడ గ్రామపంచాయతిలో సర్వేనెంబర్ 277 లో ఉన్న బీసీ సమాధుల స్మశానవాటికలోనే బీసీలు సమాధులు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కేటాయించిన స్మశానవాటిక దళితులకేనన్న భావనకు నాంది పలుకుతుంది. అంతే కాదు ప్రజల మధ్య కులాల మధ్య కులవిబేదాలకు తావిస్తుంది.

మాకు ఎన్నాళ్లు ఈ వివక్ష

  • బేగరి మహిపాల్ వార్డు సభ్యుడు

రాజ్యాంగలో దళితులకు ఎన్ని హక్కులు కల్పించిన, ఎన్ని చట్టాలు చేసినా, మాకు మాత్రం న్యాయానికి దూరంగానే ఉంచుతున్నారని, ఈ పోరాటాన్ని ఎంత దూరమైనా తీసుకు పోతాము కానీ వెనకడుగు వేయబోమని ఆ గ్రామం వార్డు సభ్యుడు బేగరి మహిపాల్ మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News