Thursday, February 26, 2026
HomeజాతీయంPiyush Goyal | అమెరికాతో ఒప్పందంపై తొందరలేదు

Piyush Goyal | అమెరికాతో ఒప్పందంపై తొందరలేదు

  • ఈయూతో ఒప్పందంతో దేశానికి మేలు
  • అమలయ్యే తేదీని త్వరలో ప్రకటిస్తాం
  • వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ వెల్లడి

ఇటీవల భారత్ యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిణామం తర్వాత అమెరికాతో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ కుదుర్చుకుంటుందా? అనే ప్రశ్నకు భారత వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ లేదని జవాబిచ్చారు. ఆయన ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. రష్యాతో చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా 50 శాతం పన్నుల్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

అమెరికా బెదిరింపులకు లొంగి.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్ లొంగిపోయిందనే వార్తలొచ్చాయి. అయితే.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ముగింపు దిశగా సాగుతుందని పీయుష్ గోయల్ తాజాగా అన్నారు. ఇయుతో భారత్ కుదుర్చుకున్నది మంచి ఒప్పందం. ఈ ఒప్పందం విషయంలో మేము చాలా చురుగ్గా పాల్గొన్నాము. ఈ ఒప్పందం విషయంలో ఇరుపక్షాలు సంతృప్తి చెందాయి. ఈ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వస్తుందో తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.

- Advertisement -

కాగా, అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకుంటుందా? అని ప్రశ్నించగా.. అమెరికాతో ఒప్పందం విషయంలో కానీ.. ఆ దేశంతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కానీ ఏమీ లేవని నేనకుటున్నాను. కానీ ప్రస్తుతం మేము అమెరికాతో ఒప్పందం చేసుకోకూడదని అనుకుంటున్నాము. ఆ దేశంతో ఒప్పందం ముగించాలనే ఆలోచిస్తున్నాము అని గోయల్ అన్నారు. నడా ప్రధాని మార్క్ కార్నీ ఈ ఏడాది మార్చిలో భారత్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కెనడాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని గోయల్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News