అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Kova Lakshmi) మేడారం(Medaram) సందర్శించారు. మహా జాతర(Mahajatara)ను పురస్కరించుకొని కుటుంబ సభ్యుల (Family)తో కలిసి వన దేవతలు సమ్మక్క సారక్క(Sammakka Sarakka)లను దర్శించుకున్నారు. అనంతరం.. పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Minister Seethakka)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి.. ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యేతోపాటు BRS రెబ్బెన మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్‌లు బుర్స పోచయ్య, దుర్గం భరద్వాజ్, ఉప సర్పంచ్‌లు మామిడి లక్ష్మి, వరలక్ష్మి-దుర్గారావు, సుప్రజ, ఉమ, లలిత, శిరీష తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
