- పనులను పరిశీలించిన సీతాఫల్మండి కార్పొరేటర్ డా.సామల హేమ
సీతాఫలమండి ప్రాంతంలో ప్రజల గౌరవానికి,సమానత్వానికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం కాలక్రమేణా పాతదిగా మారడంతో,దాన్ని తొలగించి నూతనంగా పునర్నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఈ విగ్రహ పునర్నిర్మాణ పనులను సికింద్రాబాద్ ఎమ్మెల్యే,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తమ స్వంత ఖర్చులతో దాదాపు రూ.12 లక్షల వ్యయంతో చేపట్టారు.ఈ సందర్భంగా జరుగుతున్న విగ్రహ పునర్నిర్మాణ పనులను సంబంధిత కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ శుక్రవారం పరిశీలించారు.
పనుల నాణ్యత,విగ్రహం ఆకృతి,పరిసరాల అభివృద్ధి అంశాలపై ఆమె కాంట్రాక్టర్లు,అధికారులకు పలు సూచనలు చేశారు.డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలు స్పష్టంగా ప్రతిబింబించేలా విగ్రహం రూపకల్పన ఉండాలని,ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా పునర్నిర్మాణం జరగాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గరికపోగుల చంద్రశేఖర్,సభ్యులు సీతారాం,గడ్డం ప్రసాద్,లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు రాజా సుందర్ తదితరులు పాల్గొన్నారు.
