Friday, March 6, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంSuryapet | అటవీశాఖ అనుమతి లేకుండానే గనుల ఈ-వేలం

Suryapet | అటవీశాఖ అనుమతి లేకుండానే గనుల ఈ-వేలం

  • సూర్యాపేట సున్నపురాయి లీజుల్లో వేల కోట్ల స్కాం?
  • కేంద్రం చేతులెత్తేసి, రాష్ట్రానికే ఫిర్యాదు పంపిన వైనం
  • ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలి
  • డిమాండ్ చేస్తున్న న్యాయవాది కర్నాటి వెంకటరెడ్డి-
  • పూర్తి విచారణ జరిగితే ప్రభుత్వానికి సుమారు రూ. 1,500 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం..

అటవీ శాఖ అనుమతి లేకుండానే గనుల ఈ-వేలం జరిగిందంటే నమ్మ గలమా? కానీ ఇది వాస్తవం.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కనపెట్టి, అటవీ చట్టాలు, పర్యావరణ నిబంధనలను కాలరాసి, వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ను సున్నపురాయి గనుల లీజుల పేరుతో ఈ-వేలం చేసిన వ్యవహారం ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది.

కాగా 25 జూన్ 2024వ తేదీన ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం కేంద్ర గనుల శాఖ నోటిఫై చేసిన 11 మైన్స్లో కనీసం 6 మైన్స్ను జూన్ 30 లోగా వేలం ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. లేనిపక్షంలో ఎం.ఎం.డీ.ఆర్. యాక్ట్ 1957 సెక్షన్ 10బి, 11 ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నేరుగా వేలం వేస్తుందని హెచ్చరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ఆక్షన్ ద్వారా సూర్యాపేట జిల్లాలో మూడు సున్నపురాయి గనుల వేలం నిర్వహించారు. ఇది గమనించాల్సిన అంశం..

- Advertisement -

సూర్యాపేట జిల్లా అటవీ ప్రాంతాల్లో జరిగిన సున్నపురాయి గనుల ఈ-వేలం వ్యవహారం భారీ అక్రమాలు, చట్ట విరుద్ధ విధానాలు, కేంద్ర, రాష్ట్రాల నిర్లక్ష్యంను బహిర్గతం చేస్తోంది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ, అటవీ శాఖ ఎన్వోసీ లేకుండానే తెలంగాణ గనులు, భూగర్భ శాఖ మూడు సున్నపురాయి గనులకు ఈ-వేలం నిర్వహించిందన్న ఆరోపణలు ఇప్పుడు అధికారిక ఆధారాలతో బలపడుతున్నాయి.

అసలు టెండర్ ప్రక్రియ ప్రారంభం కానీ నైన్ ఈ బొగ్గు గనులపై అధికార ప్రతిపక్షాలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతున్న తరుణంలో, సూర్యాపేట జిల్లాలో జరిగిన సున్నపు రాయి గనుల ఈ వేలంలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని సీబీఐ దర్యాప్తు చేయగలరా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది..

కేంద్రానికి ఫిర్యాదు :

మూడు నెలల తర్వాత ‘రాష్ట్రానికే పంపించాం’ అన్న సమాధానం: సూర్యాపేట జిల్లాలోని పసుపులబోడు, సైదులానామా, సుల్తాన్పూర్ అటవీ బ్లాకుల్లో గనుల ఈ-వేలంపై సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నాటి వెంకట రెడ్డి 2024 డిసెంబర్ 20న ప్రధాని కార్యాలయం, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్కు ఫిర్యాదు చేశారు.

ఆక్షన్ రూల్ 5 మరియు 9 ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వేలం నిర్వహించారని ఆరోపించినప్పటికీ, మూడు నెలల పాటు స్పందించని కేంద్ర గనుల శాఖ 2025 మార్చి 18న ఇచ్చిన సమాధానం సంచలనంగా మారింది. కాగా ఫిర్యాదును తిరిగి తెలంగాణ రాష్ట్ర గనుల శాఖకే పంపామని చెప్పడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. “ఎవరిపై ఫిర్యాదు చేశానో వారికే నా ఫిర్యాదు పంపితే, అది న్యాయమా?” అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

అసలు నిజం బయటపెట్టిన అటవీ శాఖ :

ఈ వ్యవహారంపై సమాచార హక్కు చట్టం కింద సూర్యాపేట జిల్లా అటవీ శాఖను ఆశ్రయించారు.

అటవీ శాఖ ఇచ్చిన సమాధానం సంచలనాత్మకం :

మూడు గనుల బ్లాకులకు అటవీ శాఖ ఎలాంటి ఎన్వోసీ ఇవ్వలేదు.. ఆ ప్రాంతాలు కంపార్టుమెంట్లుగా కూడా విభజించబడలేదు. అయినప్పటికీ గనుల శాఖ ఈ-వేలం నిర్వహించింది.. ఇది అటవీ చట్టాలు, పర్యావరణ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు లేవు హద్దులే తెలియవు.. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, మైనింగ్ బ్లాకుల వేలంలో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ (డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు) తప్పనిసరి. కానీ.

సైదులానామా బ్లాకు:

2… 3,102 2.. 421.9 ఎకరాలు వేలం వేశారు.. మొత్తం అటవీ .. 337.7 ఎకరాలు వేలం వేశారు.. ఈ మొత్తం విస్తీర్ణం: 4,260.09 ఎకరాలుగా ఉంది.

అలాగే పసుపులబోడు బ్లాకు…

343.20 ఎకరాలు వేలం వేశారు.. దీని మొత్తం విస్తీర్ణం: 2,490.52 ఎకరాలు.. దురదృష్టం ఏమిటంటే ఏ కంపార్టుమెంట్లో, ఏ మూలలో మైనింగ్ చేయాలో నోటిఫికేషన్ లో ఎక్కడా పేర్కొనలేదు. అలాగే డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు కూడా ప్రజలకు అందుబాటులో పెట్టలేదు.

అభియోగాలున్న కంపెనీలకే లీజులు! :

ఈ -వేలంలో మరింత అనుమానాస్పద అంశం ఏమిటంటే… సైదులానామా బ్లాకు,,, దక్కన్ సిమెంట్స్ కి, సుల్తాన్పూర్ బ్లాకు.. నాగార్జున సిమెంట్స్ కి.. కేటాయించారు.. ఈ రెండు కంపెనీలపై అక్రమ మైనింగ్ కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కానీ ఆరోపణలులేని పసుపులబోడు బ్లాకు మాత్రం పోటీ లేక రద్దయ్యింది.

ఆర్.టి.ఐ.కి ‘ప్రాణహాని’ సాకుతో నిరాకరణ! :

గనుల శాఖ అధికారులు టెండర్ వివరాలు ລ້, ໑໓.໖.໑. 8(2), (2), (3), (4), (5) లను సాకుగా చూపిస్తూ.. “సమాచారం ఇస్తే సంబంధిత వ్యక్తుల ప్రాణాలకు ముప్పు” అని సమాధానం ఇవ్వడం గమనార్హం.. ఈ సమాచారం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

సమాచార కమిషన్ తీర్పుతో బట్టబయలు :

విషయం తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కు చేరగా, కమిషనర్ స్పందిస్తూ.. గనుల శాఖ ఇచ్చిన సమాధానం చట్ట విరుద్ధమని, వారం రోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.. అయితే ఆ ఆదేశాల తర్వాత ఇచ్చిన మ్యాపుల్లో కూడా కంపార్టుమెంట్ వివరాలే లేకపోవడం గమనార్హం.

రూ.1,500 కోట్ల పెనాల్టీ అవకాశం? :

ఈ ఫిర్యాదుదారుడైన న్యాయవాది అంచనా ప్రకారం.. వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిగితే, అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం, పెనాల్టీ కలిపి సుమారు రూ.1,500 కోట్లకు పైగా ఉండొచ్చు.

మొత్తం మీద అటవీ అనుమతి లేకుండా, హద్దులు లేకుండా, కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిన ఈ-వేలం పర్యావరణానికి ముప్పును తెచ్చిపెడుతుంది.. ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం జరుగుతుంది.. చట్టపరమైన పాలనపై అనేక అనుమానాలు తలెత్తుతాయి.. కనుక ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు, కేంద్రస్థాయి విచారణ జరగాలనే డిమాండ్ని న్యాయవాది వెంకటరెడ్డి లేవనెత్తుతున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News