Wednesday, March 11, 2026
Homeనల్లగొండInquiry | యాదాద్రి దేవస్థానంలో డాలర్లు మాయం

Inquiry | యాదాద్రి దేవస్థానంలో డాలర్లు మాయం

  • యాదగిరిగుట్ట ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ
  • జూనియర్ అసిస్టెంట్,రికార్డు అసిస్టెంట్ సస్పెండ్
  • సూపరిండెంట్లకు చార్జి మెమొలు
  • సహాయ కార్యనిర్వహణాధికారికి షోకాస్ నోటీసులు జారీ చేసిన ఆలయ ఈవో.

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో రెండు రోజుల క్రిందట ప్రకంపనలు సృష్టించిన స్వామివారి డాలర్లు మాయమైన విషయమై దేవస్థానం ఆలయ ఈవో భవాని శంకర్ స్పందించారు.అనేక పత్రిక, ప్రచురణల శీర్షికలతో డాలర్లు మాయమైన విషయమై బయటకు వచ్చిన నేపథ్యంలో విచారణకు ఆదేశించారు.అలాగే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో జారీ చేశారు.ప్రచార శాఖలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించేందుకు జూనియర్ అసిస్టెంట్ రామచంద్రశేఖర్,రికార్డు అసిస్టెంట్లు లక్ష్మి,ఇద్దరినీ విధులనుండి సస్పెండ్ చేశారు.

ప్రచారశాఖలో పర్యవేక్షణ లోపం వల్ల విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్లు నటరాజు, సీతారామచార్యులకు చార్జి మెమొలు జారీ చేశారు…ఇలా సస్పెండ్ అయిన వారిని పేర్లతో హోదాలతో సహా తెలిపిన ఆలయ అధికారులు సహాయ కార్య నిర్వహణ అధికారికి షోకాస్ నోటిలో జారీ చేశారు కానీ, అధికారి పేరు అందరికీ తెలిసినప్పటికీ ఆలయ అధికారులు మాత్రం సంబంధిత అధికారి పేరు బయట పెట్టకపోవడానికి గల కారణాల వెనక ఉన్న అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News