Thursday, February 26, 2026
Homeస్పోర్ట్స్T20 Match | ఇండియాపై న్యూజిలాండ్ విజయం

T20 Match | ఇండియాపై న్యూజిలాండ్ విజయం

విశాఖపట్నంలో బుధవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇండియాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మన దేశం 18.4 ఓవర్లలో 165 రన్నులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌‌లో కివీస్ తొలిసారి నెగ్గింది. సిరీస్‌ను ఇండియా ఇప్పటికే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మన టీమ్‌లో శివం దూబే 65 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. రింకూ సింగ్ 39 రన్నులు చేశాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ మూడు వికెట్లు, జాకబ్ 2, సోధి 2 వికెట్లు తీశారు. హెన్రీ, జాక్ చెరో వికెట్ నేలకూల్చారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ 62 పరుగులు తీశాడు. దేవన్ 44, మిచెల్ 39 రన్నులు చేశారు. మన బౌలర్లలో అర్హదీప్ 2, కుల్దీప్ 2, బుమ్రా ఒకటి, బిష్ణోయ్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News