ములుగుజిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహా జాతరలో మొదటిరోజు భక్తుల సంబరాలు అంబరాన్ని అంటుతున్న తరుణంలో బుధవారం మధ్యాహ్నం జంపన్న వాగులో ఓ భక్తుడు గల్లంతు అయి విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మంచిర్యాల జిల్లాకు చెందిన కిరణ్ (45) కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం అమ్మవార్ల దర్శనానికి మేడారనికి చేరుకున్నారు మేడారం జంపన్నవాగులో పుణ్యస్నానం కోసం వాగులో దిగిన కిరణ్ నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జాతరలోని భక్తులలో తీవ్ర దిగ్భ్రాంతిని నెలకొల్పింది పుణ్యస్నానం కాస్త శాపంగా మారింది కళ్లముందే జరిగిన ఘటనతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల భక్తులు భయాందోళనకు గురయ్యారు.
- Advertisement -
