Wednesday, February 11, 2026
Homeస్పోర్ట్స్T20 Series | టీ20 సిరీస్.. ఇండియా కైవసం..

T20 Series | టీ20 సిరీస్.. ఇండియా కైవసం..

మూడో మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌పై విజయం

అసోంలోని గువాహటిలో ఆదివారం న్యూజిలాండ్‌(Newzealand)తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌(3rd T20 Match)లోనూ ఇండియా విజయం(India Win) సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. కివీస్ ఇచ్చిన 154 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 10 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలుత టాస్ గెలిచిన మన దేశం బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 153 రన్నులు చేసింది. ఇండియా బౌలర్లలో బుమ్రా 3, బిష్ణోయ్ 2, పాండ్య 2, రాణా ఒక వికెట్ తీశారు. అభిషేక్ శర్మ(Abhishek Sharma) 20 బాల్స్‌లోనే 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లోనే 57 రన్నులు తీసి నాటౌట్‌గా ఉన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News