Thursday, February 12, 2026
Homeఆరోగ్యంKidney | కిడ్నీలను కాపాడుకోండిలా

Kidney | కిడ్నీలను కాపాడుకోండిలా

మన ఆరోగ్యాన్ని చాలా వరకు కిడ్నీలే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటిని కాపాడుకుంటే మనం హెల్దీ(Healthy)గా ఉంటాం. మూత్రపిండాల పనితీరు మందగిస్తే సంబంధిత లక్షణాలు(Symptoms) మన శరీరంలో కనిపిస్తాయి. ఆకలి తగ్గుతుంది (Hunger Decrease). బాడీ వీక్(Body Weak) అవుతుంది. శరీరం అలసటగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది(Breathing Problem). వికారం, వాంతులు(Vomiting) వంటివి వస్తాయి. బీపీ(BP) పెరుగుతుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోవటం వల్ల బాడీలో వేస్ట్ ఎక్కువగా ఉంటే బలహీనపడిపోతాం. చురుకుదనం లోపిస్తుంది. మూత్రపిండాలు డ్యామేజ్ అయితే మన శరీరంలోని ద్రవాలు బయటికిపోవు. ఊపిరితిత్తుల్లో పేరుకుపోతాయి. దానివల్ల గాలి తీసుకోవటం, వదలటం కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. కాళ్లు వాచినట్లు కనిపిస్తాయి. తరచుగా యూరిన్‌కి వెళతాం. మూత్రం తక్కువగా వస్తుంది. రంగు మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను కలవటం బెటర్. మంచి నీళ్లు ఎక్కువ తాగాలి. పండ్లు, కూరగాయలు తినాలి. ఉప్పు, పంచదార తగ్గించాలి. మందు అలవాటు ఉంటే మానేయాలి. పొగ తాగటం కూడా బంద్ చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News