Tuesday, February 10, 2026
Homeమెదక్‌Science Fair | సంగారెడ్డిలో ముగిసిన సైన్స్ ఫెయిర్

Science Fair | సంగారెడ్డిలో ముగిసిన సైన్స్ ఫెయిర్

సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని గడియం స్కూల్‌లో జరిగిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్(South India Science Fair)-2026 ముగిసింది. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarsimha) హాజరయ్యారు. విద్యార్థులతో మాట్లాడి వారి వినూత్నమైన సైన్స్ నమూనాల (Innovative Science Models)ను తిలకించారు. బాలబాలికల సృజనాత్మకతను ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో రాణించాలంటే భాషా నైపుణ్యాలు, సృజనాత్మకత(Creativity), నైపుణ్యాభివృద్ధి కావాలని చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ప్రాథమిక విద్య నుంచి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల వరకు నాణ్యమైన విద్య అందించబోతోందని చెప్పారు. ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లా స్థాయి ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తున్నామని, నర్సింగ్ కళాశాలలను విస్తరిస్తున్నామని, ప్రపంచ అవకాశాల కోసం విదేశీ భాషా శిక్షణ (జపనీస్ & జర్మన్) అందిస్తున్నామని తెలిపారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన విద్యార్థులకు నగదు బహుమతులు, షీల్డ్‌లు, సర్టిఫికెట్‌లు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News