Homeమహబూబ్‌నగర్‌ABVP | రాజ్యాంగ విలువలను పెంపొందించడమే ఏబీవీపీ లక్ష్యం.

ABVP | రాజ్యాంగ విలువలను పెంపొందించడమే ఏబీవీపీ లక్ష్యం.

  • ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్..

జాతీయ భావనను, రాజ్యాంగ విలువలను పెంపొందించడమే ఏబీవీపీ లక్ష్యమని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్ అన్నారు. భారతదేశ 77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి దేశభక్తి నినాదాలతో తీరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ..

ABVP Republic Day Rally2

గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పాటు దేశం పట్ల ఉన్న విధులు బాధ్యతలను గుర్తుచేసే దినమని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఏబీవీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులు కాలరాయబడినప్పుడు రాజీపడకుండా ప్రశ్నించడమే నిజమైన గణతంత్ర స్ఫూర్తి అని ఘంటాపదంగా చెప్పారు.1950 జనవరి 26 న భారతదేశం రాజ్యాంగాన్ని స్వీకరించి ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని గుర్తు చేస్తూ..

- Advertisement -
ABVP Republic Day Rally

రాజ్యాంగ విలువలను కాపాడుతూ, స్వాభిమానం తో కూడిన బలమైన భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులను ఆ దిశగా చైతన్యవంతం చేయడంలో ఏబీవీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి విద్యార్థి త్రివర్ణ పతాకం కింద ఐక్యంగా నిలబడి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, వికసిత భారత నిర్మాణానికి కట్టుబడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వసతి గృహాల కన్వీనర్ జ్ఞానేశ్వర్, పట్టణ సంయుక్త కార్యదర్శి బంటి, శంకర్, నందకిషోర్, సంతోష్, పరమేష్, మురళి, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News