- 111 జీఓ నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్ల నిర్మాణం..
- అక్రమార్కులకు వంతపాడుతున్న అధికారులు..
- చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో 111 జీవో నిబంధనలు కేవలం కాగితాలపైనే మిగిలి పోతున్నాయి. హైదరాబాద్ నగర సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు కోట్లలో ఉండటం రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆకర్షిస్తోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ వందల ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారుల మౌనం, అండదండలు ఈ అక్రమాలకు వెన్నుదన్నుగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దొంతాన్ పల్లి గ్రామంలో నిషేధిత నిర్మాణాల జోరు….
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం దొంతాన్ పల్లి గ్రామం హైదరాబాద్ కి కూత వేటు దూరంలో ఉండడంతో ఇక్కడ భూముల ధరలు కోట్లలో ఉండటం రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆకర్షిస్తోంది. అయితే ఈ ప్రాంతం పూర్తిగా 111 జీవో పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, వెంచర్లకు అనుమతి లేదు. అయినప్పటికీ, హైదరాబాద్ మెయిన్ రోడ్డు లో అక్రమ రేకుల షెడ్ల నిర్మాణాలు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యకలాపాలు పంచాయతీ అధికారుల ఆమోదంతోనే సాగుతున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. “ఇంత భారీ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులకు కనిపించలేదా?” అని వారు ప్రశ్నిస్తున్నారు.111జీవోకు విరుద్ధంగా నిర్మించిన ఈ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నియమాలు పేదలకేనా…?
111 జీవో నిబంధనలు కేవలం సామాన్యులకు, పేదలకు మాత్రమే వర్తిస్తాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మినహాయింపు ఉందన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. “పేదలు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా నిబంధనల పేరుతో ఆపేస్తారు, కానీ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలాంటి అడ్డంకులు లేవు,” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అక్రమ ఊపందుకున్నాయని వారు ఆరోపిస్తున్నారు. నిర్మాణాలు

