Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిఈ నెల 22న బాటసింగారం గ్రామపంచాయతీ సీఎం కప్ టోర్నమెంట్.

ఈ నెల 22న బాటసింగారం గ్రామపంచాయతీ సీఎం కప్ టోర్నమెంట్.

అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పరిదిలోని బాటసింగారం గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో సీఎం కప్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నారు. బాటసింగారం గ్రామపంచాయతీ పరిధిలోని క్రీడాకారులను ఈ నెల 22వ తేదీన ఉదయము 10 గంటలకు బాటసింగారంలోని నేతాజీ విగ్రహం దగ్గర గల మైదానంలో హాజరుకావాలని కోరారు.

గ్రామంలోని మట్టిలోని మాణిక్యాలను గుర్తించి గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా టోర్నమెంట్ను నిర్వహిస్తుందని, దానిని బాటసింగారంలోని గ్రామస్తులు, క్రీడాకారులు,క్రీడాభిమానులు, అందరూ సద్వినియోగపరుచుకోవాలని, గ్రామపంచాయతీలో క్రీడాకారులకు అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్,ఖో-ఖో, యోగ మరియు ఫుట్బాల్ క్రీడలు ఉంటాయని తెలిపారు.

- Advertisement -

గ్రామస్థాయిలో ఎంపికైన క్రీడాకారులను ఈనెల 29వ తేదీన మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో జరిగే మండల స్థాయి పోటీలకు పంపిస్తామని గ్రామ సర్పంచ్ ఎర్రవెల్లి గౌరీ శంకరాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

మిగతా వివరాలకు డాక్టర్ సోలపోగుల స్వాములు ఫిజికల్ డైరెక్టర్ బాటసింగారం 9866469054కు సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News