పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికలు(Portugal Presidential Elections) ఇవాళ జరుగుతున్నాయి. రికార్డ్ స్థాయిలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 11 మిలియన్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఫలితాలు కూడా ఈ రోజే(Results Today) విడుదల కానున్నాయి. కాకపోతే.. ఏ ఒక్క అభ్యర్థి కూడా మొదటి రౌండ్(First Round)లో విజయం సాధించడానికి.. 50 శాతానికి పైగా ఓట్లను సొంతం చేసుకునే అవకాశాలు లేవు. కాబట్టి టాప్ 2లో నిలిచే అభ్యర్థులు వచ్చే (ఫిబ్రవరి) నెల 8న జరిగే రన్‌ఆఫ్ బ్యాలెట్(Runoff Ballot)లో పోటీ పడాల్సి ఉంటుంది. పోర్చుగల్‌కి ప్రస్తుతం మార్సెలో రెబెలో డి సౌసా (Marcelo Rebelo de Sousa) పదేళ్ల నుంచి అధ్యక్షుడిగా ఉన్నారు. గెలిచే అభ్యర్థి ఈయన స్థానంలో బాధ్యతలు చేపడతారు. 11 మంది పోటీపడుతుండగా అందులో ఒక్కరే మహిళ ఉండటం గమనార్హం. పోర్చుగల్‌కి ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కాలేదు.
Portugal | నేడు పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికలు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
