Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Vaikuntha Ekadashi | టీటీడీకి చంద్రబాబు అభినందనలు

Vaikuntha Ekadashi | టీటీడీకి చంద్రబాబు అభినందనలు

తిరుమల శ్రీవారి సన్నిధి(Tirumala Srivari Sannidhi)లో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానాని(TTD)కి, జిల్లా యంత్రాంగానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) అభినందనలు(Congratulations) తెలిపారు. 2025 డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు కల్పించిన ఉత్తర ద్వార దర్శనం(Uttara Dwara Darshanam)లో 97 శాతం మంది సామాన్య భక్తులే దర్శనం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఉత్తర ద్వార దర్శనంలో 7.83 లక్షల మందికి దర్శనం కల్పించడం ద్వారా శ్రీవారి అనుగ్రహానికి వారిని పాత్రులను చేశారని చెప్పారు. క్యూలైన్ల మానిటరింగ్(Queue Monitoring), అన్నప్రసాదం(Annaprasadam) నుంచి భక్తులకు కల్పించే ప్రతి సౌకర్యంలో తీసుకున్న జాగ్రత్తలు, అమలు చేసిన విధానాలు మంచి ఫలితాలు ఇచ్చాయని ప్రశంసించారు. శ్రీవారి భక్తులు సంతృప్తి చెందేలా వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు అని పేర్కొన్నారు. తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడుకునేందుకు భక్తులు కూడా కలిసి రావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News