Sunday, February 22, 2026
Homeఆరోగ్యంHealth Care | ఆరోగ్య సంరక్షణలో వర్మ చికిత్స

Health Care | ఆరోగ్య సంరక్షణలో వర్మ చికిత్స

వర్మ చికిత్సా విధానం(Varma Treatment Method).. మన దేశంలోని ప్రాచీన వైద్య సంప్రదాయాల్లో ముఖ్యమైంది. తమిళ సిద్ధ వైద్యంలో కీలక స్థానాన్ని కలిగి ఉంది. మానవ శరీరంలోని ప్రత్యేక శక్తి కేంద్రాలను వర్మ బిందువులు అంటారు. వాటిపై సరైన ఒత్తిడి, మర్దన లేదా స్పర్శ ద్వారా శరీరంలోని శక్తి ప్రవాహం సమతుల్యమవుతుంది.

వర్మ చికిత్స మన శరీరంలో ప్రాణశక్తిని(Vital Energy) పెంపొందించడం ఆధారంగా పనిచేస్తుంది. ఈ శక్తి.. నాడులు, కండరాలు, ఎముకలు, సంధుల ద్వారా ప్రవహిస్తుంది. శరీరంలోని ప్రతి వర్మ బిందువు వద్ద ఈ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. వాటిలో అడ్డంకులు ఏర్పడ్డప్పుడు నొప్పి, వ్యాధులు, మానసిక అసంతులనం ఏర్పడతాయి. వర్మ థెరపీ ద్వారా ఈ అడ్డంకులను తొలగించి సహజ వైద్య ప్రక్రియను ఉత్తేజితం చేస్తారు.

- Advertisement -

నేటి ఆరోగ్య సంరక్షణలో వర్మ థెరపీని పూరక వైద్య విధానం(Complementary Therapy)గా ఉపయోగిస్తున్నారు. ఇది అల్లోపతి చికిత్సలకు ప్రత్యామ్నాయం కాకుండా సహాయక విధానంగా కూడా మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రస్తుతం వర్మ చికిత్సను ఈ కింది సమస్యలకు ఉపయోగిస్తున్నారు. మెడ, నడుము, మోకాళ్ల నొప్పులు, కండరాల గాయాలు(Muscle Injuries), నరాల సంబంధిత సమస్యలు, తలనొప్పి, మైగ్రేన్, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, సంధి వాతం(Arthritis).

ఆధునిక వైద్య పరిశోధనలు వర్మ థెరపీ ప్రభావాన్ని న్యూరోస్టిమ్యులేషన్, రిఫ్లెక్సాలజీ, అక్యుప్రెషర్ వంటి విధానాలతో చెప్పొచ్చు. వర్మ బిందువులపై ఒత్తిడి నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల సహజంగా నొప్పి తగ్గించే హార్మోన్లు (ఎండార్ఫిన్లు) విడుదలవుతాయి. వర్మం చికిత్స వల్ల ఔషధాల వినియోగం తక్కువగా ఉంటుంది. శరీరానికి దుష్ప్రభావాలు తక్కువ కలుగుతాయి. ఇది సహజమైన, సంపూర్ణ చికిత్స విధానం. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

శిక్షణ పొందిన వర్మ వైద్యుడితో మాత్రమే చేయించాలి. తీవ్రమైన గాయాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో వైద్యుడి సలహా అవసరం.
గర్భిణిలు, తీవ్రమైన నరాల వ్యాధులున్నవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. వర్మ థెరపీ.. సమకాలీన ఆరోగ్య సంరక్షణలో విలువైన పూరక వైద్య విధానమని చెప్పొచ్చు. సంప్రదాయ జ్ఞానం, ఇతర వైద్య విధానాల అవగాహన సమన్వయంతో పని చేస్తే అనేక అనారోగ్యాలను శాశ్వతంగా అదుపులోకి తీసుకురావొచ్చు. సమగ్ర ఆరోగ్య సంరక్షణలో వర్మ థెరపీ సహజ, సమర్థవంతమైన మార్గమని చెప్పొచ్చు.

  • డాక్టర్ బాలాజీ దీక్షితులు పి.వి.
- Advertisement -
RELATED ARTICLES

Latest News