Friday, February 27, 2026
Homeస్పోర్ట్స్NZ Series | కివీస్ సిరీస్‌కి ఇండియా టీమ్ ప్రకటన

NZ Series | కివీస్ సిరీస్‌కి ఇండియా టీమ్ ప్రకటన

హైదరాబాదీ పేసర్ సిరాజ్‌కి వన్డేల్లో చోటు

సీనియర్ ఇండియా ఫాస్ట్ బౌలర్(Senior India Fast Bowler) మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) మళ్లీ టీమిండియా(Team India)లోకి వచ్చాడు. ఈ నెలలో ఇండియాలో మొదలయ్యే మూడు వన్డేల న్యూజిలాండ్ సిరీస్‌(New Zealand Series)కి అతణ్ని ఎంపిక చేశారు. కివీస్‌తో తొలి వన్డే ఈ నెల 11న వడోదరలో, రెండో వన్డే 14న రాజ్‌కోట్‌లో, మూడో వన్డే 18న ఇండోర్‌(Indore)లో నిర్వహించనున్నారు. ఈ సిరీస్(NZ Series) కోసం సెలెక్ట్ చేసిన టీమ్.. శుభ్‌మన్‌గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), సుందర్, రవింద్ర జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులో ఉంటాడు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News