Friday, February 27, 2026
Homeవరంగల్‌Jagruthi | జాగృతి పోలీస్ కళా బృందం ప్రదర్శన.

Jagruthi | జాగృతి పోలీస్ కళా బృందం ప్రదర్శన.

  • ఎస్.ఐ బి. ప్రవీణ్ ఆధ్వర్యంలో

వరంగల్ నగర పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి 9:00 గంటల వరకు పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బూరుగుమళ్ళ గ్రామంలో పోలీస్ కళా బృందం వారిచే యువకులు గంజాయి డ్రగ్స్, గుట్కా మత్తు పదార్థాల బారిన పడవద్దని, గంజాయి అమ్మిన సేవించిన 8712584473 మొబైల్ నెంబరుకు సమాచారం ఇవ్వాలని చెబుతూ, చదువు, రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, డయల్100, సీసీ టీవీ కెమెరాలు, వృద్ధాప్యంలో తల్లితండ్రులను మంచిగ చూసుకోవాలని, మూడ నమ్మకాలపై మ్యాజిక్ షో, అలాగే తదితర సామాజిక అంశాలపై పాటల ద్వారా వివరిస్తూ, ఆన్ లైన్ బెట్టింగ్ ఆప్స్, సైబర్ క్రైమ్ పై నాటిక ద్వారా ప్రదర్శన చేస్తూ, 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ గురించి చెప్పనైనది.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్.ఐ బి.ప్రవీణ్, కానిస్టేబుల్స్ ఆఫీసర్స్, గ్రామ సర్పంచ్, కళా బృందం ఇంచార్జీ ఏ.ఎస్.ఐ నాగమణి, కళాబృందం సభ్యులు హెడ్ కానిస్టేబుల్స్ విలియమ్, రత్నయ్య, కానిస్టేబుల్ పూల్ సింగ్, హోంగార్డ్స్ శ్రీనివాస్, నారాయణ, విక్రమ్ రాజు, చిరంజీవి గ్రామస్తులు దాదాపు 400 మంది వరకు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News