వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించిన ఎమ్మెల్యే నాగరాజు, నియోజకవర్గానికి మరింత ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాల కోసం తగిన నిధులు కేటాయించాలని కోరారు. ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి దిశగా ప్రజా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు పేర్కొన్నారు.
- Advertisement -
