Sunday, February 22, 2026
HomeజాతీయంTerror | భారీ ఉగ్ర కుట్ర భగ్నం..

Terror | భారీ ఉగ్ర కుట్ర భగ్నం..

  • రాజస్థాన్‌లో కలకలం రేపిన ఘటన..
  • పెద్ద స్థాయిలో బాంబు పేలుళ్లకు ప్లాన్‌..
  • పోలీసుల అప్రమత్తంతో తప్పిన ముప్పు..
  • 150 కేజీల అమ్మోనియం నైట్రేట్‌ సీజ్‌..

రాజస్థాన్‌లో ఉగ్రవాదులు భారీ ఉగ్రకుట్రకు పన్నాగం పన్నారు. పెద్ద స్థాయిలో బాంబు పేలుళ్లకు ప్లాన్‌ చేశారు. అయితే, పోలీసులు అప్రమత్తం అవ్వటంతో ఉగ్రకుట్ర భగం అయింది. టోంకోలో ఓ మారుతీ కారులో తరలిస్తున్న 150 కేజీల అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. నిందితులు ఎంతో తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యూరియా బస్తాల్లో అమ్మోనియం నైట్రేట్‌ను తరలించడానికి ప్రయత్నించారు. అమ్మోనియం నైట్రేట్‌తో పాటు 200 దాకా ఎక్స్‌ ప్లోజివ్‌ బ్యాటరీలు, 1100 మీటర్ల పొడువైన వైర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. వారిని సురేంద్ర, సురేంద్ర మోచీగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News