Tuesday, February 10, 2026
Homeఆరోగ్యంIAMA Foundation | ఘనంగా ఐఏఎంఏ వార్షిక సదస్సు

IAMA Foundation | ఘనంగా ఐఏఎంఏ వార్షిక సదస్సు

డాక్టర్ దామోదర్ నెరెల్లా ఆధ్వర్యంలో..
ఐఏఎంఏ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు
ఆయన ఎంతో మందికి ఆదర్శమన్న అతిథులు
తల్లిని గుర్తుచేసుకొని భావోద్వేగంగా ప్రసంగించిన డాక్టర్ దామోదర్
దామోదర్‌కు మహేష్ కుమార్ గౌడ్, ఈటల, శ్రీనివాస్ గౌడ్ ప్రశంసలు

ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్(IAMA) ఫౌండేషన్ వార్షిక సదస్సు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఉన్న ఇతిహాస్ బ్యాంక్వెట్ హాల్స్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajender), మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ (V.Srinivas Goud) హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల నరహరి, బీసీసీఐ సభ్యుడు, డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు సురేందర్ అగర్వాల్ పాల్గొని ఏఐఎంఏ ఫౌండేషన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దామోదర్ నెరెల్లా(Dr.Damodhar Nerella) సేవలను గుర్తించి ఘనంగా సత్కరించారు.

- Advertisement -

నిజమైన వైద్యం అంటే..

ఈ సందర్భంగా ఐఏఎంఏ మరియు డీఆర్ఆర్ కేర్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ దామోదర్ నెరెల్లా మాట్లాడుతూ ఫౌండేషన్ తరఫున చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, టెలీ మెడిసిన్ సర్వీసులు, అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యం అంటే రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడమే కాదని, అసలు ఆ రోగం రాకుండా ముందే అడ్డుకోవడమే నిజమైన వైద్యమని పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ అనే సిద్ధాంతాన్ని అమలుచేస్తూ ముందుగానే స్కానింగ్ పరీక్షలు చేసి ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడగలమని చెప్పారు.

ఐ, బ్లండ్ బ్యాంక్‌ల ఆలోచన

ఈ ఉద్దేశంతోనే గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా చెట్లపై నుంచి పడి ప్రాణాలు కోల్పోతున్న కల్లు గీత కార్మికుల కోసం ఐఏఎంఏ ఫౌండేషన్ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రక్త పరీక్షలు, అవసరమైన మందులు, అవసరమైతే సర్జరీలు కూడా అందరి సహకారంతో ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే.. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్‌లను ప్రారంభించాలనే ఆలోచన ఉందని, దానికి ప్రజల సహకారం అవసరమని అన్నారు. అమెరికాలోని అట్లంటాలో టామా సంస్థతో కలిసి నిర్వహిస్తున్న ఫ్రీ క్లినిక్‌ల గురించి, ఇతర దేశాల్లో ఏర్పాటుచేస్తున్న ఉచిత వైద్య శిబిరాల గురించి వివరించారు. పలు మీడియా మాధ్యమాల ద్వారా ఆరోగ్య అవగాహన, ప్రివెంటివ్ కేర్‌పై ప్రజలకు సమాచారం అందిస్తూ జీవితాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

తన తల్లి బాధ మరొకరికి రాకూడదని..

డీఆర్ఆర్ కేర్ ద్వారా వైద్యం కేవలం ఆసుపత్రులకే పరిమితం కాకుండా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఉచితంగా చేరాలనే సంకల్పంతో సేవలందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ కావాలనే తల్లి కోరికే తన జీవితానికి దారి చూపిందని, తన తల్లిలా మరొకరు క్యాన్సర్‌తో చనిపోకూడదనే సంకల్పంతో ఈ సేవా ప్రయాణం కొనసాగిస్తున్నానని డాక్టర్ దామోదర్ నెరెల్లా భావోద్వేగంగా తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసి, అండగా నిలిచిన ప్రధాన అతిథులు, ప్రత్యేక అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే.. సదస్సు విజయానికి అహర్నిశలు కృషి చేసిన టామా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కోర్ టీం, వాలంటీర్లు, సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

డాక్టర్ దామోదర్‌కు ప్రశంసలు..

ఈ సందర్భంగా డాక్టర్ దామోదర్ నెరెల్లా సేవలను అతిథులు ప్రత్యేకంగా ప్రశంసించారు. వైద్య సేవల ద్వారా ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్ దామోదర్ నెరెల్లా సేవా దృక్పథాన్ని మెచ్చుకున్నారు. డాక్టర్ కావాలనే తల్లి కోరికను తన జీవిత లక్ష్యంగా మార్చుకొని ఎంతో కష్టపడి ఇంత గొప్ప స్థాయికి ఎదిగి ఈ సేవా ప్రయాణం కొనసాగిస్తున్న డాక్టర్ దామోదర్ నెరెల్లా నేటి యువతకు ఆదర్శమని అన్నారు. ఐఏఎంఏ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని అతిథులు భరోసా ఇచ్చారు.

ఈటల అభినందనలు

పేదలకు వైద్య సహాయం అందించేందుకు ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ఈటల రాజేందర్ అన్నారు. పేద కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి, వైద్య వృత్తిని చేపట్టి దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ దామోదర్ నెరెల్లా సొంత గడ్డపై ప్రేమతో ఫౌండేషన్ ఏర్పాటుచేసి పేదలకు వైద్యం అందించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.

మహేష్ కుమార్ గౌడ్ మెచ్చుకోలు

విదేశాల్లో వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ దామోదర్ నెరెల్లా.. సంపాదించినదాంట్లో కొంత మొత్తాన్ని ఆరోగ్య సంరక్షణ సేవల కోసం అందించడం హర్షణీయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తాను సైతం పుట్టిన ఊరిలో పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు.

శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్ష

సేవే లక్ష్యంగా.. మానవత్వమే మార్గంగా.. డాక్టర్ దామోదర్ నెరెల్లా నేతృత్వంలో ఏఐఎంఏ ఫౌండేషన్ మరింత మంది ప్రాణాలను కాపాడాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు.

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు.. డాక్టర్ రామ్‌ కిరణ్, డాక్టర్ వెంకట్ సైని, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ రాజీవ్ అంగంపల్లి, డాక్టర్ సుమన్ కుమార్, డాక్టర్ వెంకట్ స్వామి, డాక్టర్ లక్ష్మినారాయణ, డాక్టర్ శంకర్, డాక్టర్ శ్రీనివాస్ స్వామి.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యఅతిథులు మహేష్ కుమార్ గౌడ్, ఈటల రాజేందర్, వి.శ్రీనివాస్ గౌడ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. విదేశాల్లో వైద్యులుగా స్థిరపడి స్వగ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ డాక్టర్ల బృందం.. తమ సర్వీసులను గుర్తించి అభినందించేందుకు హాజరైన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి జన్మభూమి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News