సోషల్ మీడియా యాప్స్ వినియోగంపై సిబ్బందికి ఇండియన్ ఆర్మీ కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా యాప్స్లో ఎలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు తెలుపకూడదని ఆర్మీ స్పష్టం చేసింది. భద్రత, సున్నితమైన సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పర్యవేక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే ఇన్స్టా, ఎక్స్ యాక్సెస్ ఉంటుందని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. యాప్లో పోస్టింగ్స్, లైక్స్, కామెంట్స్ చేయడంపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.
కమ్యూనికేషన్ కోసం సిబ్బంది సురక్షితమైన యాప్స్ని వినియోగించాలని ఆర్మీ ఉన్నతాధికారులు దిశానిర్దేశర చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది ఆర్మీ.. జాతీయ భద్రత కోసం ఈ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సిందేనంటూ సిబ్బందిని ఆదేశించింది
- Advertisement -
