హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్(Muchchintal) శ్రీరామనగరంలో ఉన్న పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి(Chinajiyar Swami) వారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(Palvai Harish Babu) దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం.. 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి(Samathamurthi) విగ్రహాన్ని, 120 కిలోల బరువున్న స్వర్ణ రామానుజమూర్తిని, దివ్య ప్రదేశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(Adilabad MLA Payal Shankar), ముధోల్ ఎమ్మెల్యే(Mudhol MLA) రామారావు పటేల్(Rama Rao Patel), నాయకులు అశోక్ ముస్తాపురే తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
