రైలు ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి(Train Ticket Fares Hike). కొత్త ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ(Railway Ministry) పేర్కొంది. 215 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి పెరిగిన ఛార్జీలు వర్తించవు. 215 కిలోమీటర్ల పైన ప్రయాణం చేసేవారికి సాధారణ తరగతి(Ordinary Class) బోగీల్లో కిలోమీటర్‌కు పైసా, నాన్ ఏసీ క్లాస్ మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లు(Express Trains), అన్ని ఏసీ క్లాసుల్లో(AC Class) కిలో మీటర్‌కి 2 పైసల చొప్పున పెంచారు.
సబ్ అర్బన్ ట్రైన్ల(Sub Urban Trains)లో నెల వారీ సీజన్ టికెట్లకు, ఇతర రైళ్లలో 215 కిలో మీటర్లలోపు ప్రయాణానికి కూడా ఈ పెంపు వర్తించదు. టికెట్ల రేట్లు పెంచటం ద్వారా రైల్వేకి 2026 మార్చి 31 నాటికి రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుంది. 2025 జులైలో పెంచిన రేట్ల వల్ల ఇప్పటివరకు రూ.700 కోట్ల రాబడి వచ్చినట్లు రైల్వే పేర్కొంది.
