Thursday, March 5, 2026
Homeఅంతర్జాతీయంUkraine | మెక్రాన్‌తో మాట్లాడేందుకు పుతిన్ రెడీ

Ukraine | మెక్రాన్‌తో మాట్లాడేందుకు పుతిన్ రెడీ

ఉక్రెయిన్ యుద్ధం(Ukraine War)పై ఫ్రాన్స్ అధ్యక్షుడు (France President) ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌(Emmanuel Macron)తో మాట్లాడటానికి వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సిద్ధంగా ఉన్నారని రష్యా అధ్యక్షుడి ప్రతినిధి (Russia President Representative) ఆదివారం ప్రచురించిన ఇంటర్వ్యూలో తెలిపారు. మెక్రాన్‌తో సంభాషణలో పాల్గొనడానికి పుతిన్ సంసిద్ధతను వ్యక్తం చేశారు అని డిమిత్రి పెస్కోవ్ రష్యా వార్తా సంస్థ రియా నోవోస్టితో అన్నారు. కాబట్టి.. పరస్పర రాజకీయ సంకల్పం ఉంటే దీన్ని సానుకూలంగా తీసుకోచ్చు అని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధానికి నాలుగో ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో.. బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల ($105 బిలియన్) రుణం ఇవ్వడానికి యూరోపియన్ యూనియన్ నేతలు తాజాగా అంగీకరించారు. కానీ.. నిధులను సమకూర్చుకోవడానికి స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించడంపై వారు అంగీకారానికి రాలేకపోయారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News