Friday, February 27, 2026
Homeఫోటోలు3 Roses | "త్రీ రోజెస్" సీజన్ 2లోని హర్ష చెముడు ప్రసాద్

3 Roses | “త్రీ రోజెస్” సీజన్ 2లోని హర్ష చెముడు ప్రసాద్

  • హీరో సాయిదుర్గ తేజ్ ఫన్ ఛాట్

ఈషా రెబ్బా, సత్య, రాశీ సింగ్, హర్ష చెముడు, సూర్య శ్రీనివాస్ , సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఆహా ఒరిజినల్స్ వెబ్ సిరీస్ “త్రీ రోజెస్” సీజన్ 2 స్ట్రీమింగ్ కు వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ లో ప్రసాద్ క్యారెక్టర్ లో నవ్విస్తున్నారు హర్ష చెముడు. తాజాగా ఈ క్యారెక్టర్ పై హీరో సాయి దుర్గతేజ్ ఇన్ స్టా ద్వారా ఫన్ ఛాట్ చేశారు. మా ప్రసాద్ కు హెల్ప్ చేయి అన్నా అంటూ ఆహా కోరగా, సాయి దుర్గతేజ్ నవ్వుతూ ఎమోజీ పోస్ట్ చేశారు. ఈ ఛాట్ లో హర్ష చెముడు కూడా జాయిన్ అయ్యారు.

తన క్యారెక్టర్ ఎంట్రీతో ముగ్గురు హీరోయిన్స్ కథను మార్చేసిన ఆ ప్రసాద్ ఏం చేశాడో  “త్రీ రోజెస్” సీజన్ 2లో చూడాల్సిందే. “త్రీ రోజెస్” సీజన్ 2 సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరించారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News