- 41 మంది మావోయిస్టుల లొంగుబాటు
- డిజిపి శివధర్ ఎదుట లొంగిన నక్సల్స్
- రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి కూడా..
- కగార్, నేతల మృతితో బలహీనపడిన పార్టీ
- 24 ఆయుధాలు అప్పగించిన నక్సల్స్
- తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ.25 వేలు
- వివరాలు వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి
లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు తెలంగాణ వాళ్లు ఉండటం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ / కంపెనీ స్థాయి కమిటీ సభ్యులు, 12 మంది ఏరియా / ప్లాటూన్ కమిటీ సభ్యులు, 23 మంది సాధారణ పార్టీ సభ్యులు
నిషేధిత మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో బటాలియన్, వివిధ డివిజనల్, ఏరియా కమిటీ స్థాయి నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 24 ఆయుధాలు, 733 తూటాలు, 8 బీజీఎల్ షెల్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు తెలంగాణ వాళ్లు ఉండటం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ / కంపెనీ స్థాయి కమిటీ సభ్యులు, 12 మంది ఏరియా / ప్లాటూన్ కమిటీ సభ్యులు, 23 మంది సాధారణ పార్టీ సభ్యులు ఉన్నారు. ఇన్సాస్ ఎల్‌ఎంజీ, ఏకే47, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ రైఫిళ్లు, 303 రైఫిళ్లు తదితర ఆయుధాలు లొంగుబాటులో భాగంగా అప్పగించారు. మావోయిస్టు పార్టీలో సంస్థాగత బలహీనత, నాయకత్వంపై నమ్మకం తగ్గడం, అడవుల్లో తీవ్ర జీవన కష్టాలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగానే తాము ప్రధాన జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి రాష్ట్ర పునరావాస విధానం ప్రకారం డివిజనల్ కమిటీ సభ్యులకు రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, పార్టీ సభ్యులకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. ఆయుధాలపై అదనపు రివార్డు కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా రూ.1.46 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు మరింత బలహీనపడతాయని, మిగిలిన అజ్ఞాత కేడర్లు కూడా హింసను వీడి జనజీవనంలోకి రావాలని పోలీసులు పిలుపునిచ్చారు.నక్సలిజాన్ని రూపుమాపేందుకు, మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది మావోలు భద్రతబలగాల ఎన్ కౌంటర్ లో మృతిచెందారు.

మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో మావోయిస్టులు కలిసిపోయారు.. లొంగిపోయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్రస్థాయి లీడర్లు.. కొందరు హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు, ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. మావోయిస్టుల వద్ద నుంచి 24 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నట్లు డీజీపీ వెల్లడిరచారు. తెలంగాణ పోలీసుల మేజర్ ఆపరేషన్ సక్సెస్‌తో మావోయిస్ట్ పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలిన్లటైంది.
