కూరల్లో(Curries) ఉప్పు తగ్గితే చాలా మందికి కోపం(Angry) వస్తుంది. కానీ.. ఉప్పును తగ్గించకపోతే రోగం(Disease) వస్తుంది. ఉప్పు తగ్గితే వంటలు రుచి (Taste) అనిపించకపోవచ్చు. కానీ.. టేస్ట్ కోసం సాల్ట్ పైనే ఆధారపడటం హెల్త్(Health)కి మంచిది కాదు. రోజుకు ఒక చెంచా(5 Grams) కన్నా ఎక్కువ ఉప్పు తీసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organisation) హెచ్చరిస్తోంది. అయితే.. మన దేశంలో ఎక్కువ మంది 12 గ్రాములకు పైగా సాల్ట్ తింటున్నారని అధ్యయనాల్లో తేలింది.
అందుకే హార్ట్ ఎటాక్(Heart Attack), పెరాలసిస్ (Paralysis), కిడ్నీ జబ్బులు (Kidney Problems) వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పదార్థాలకు రుచి అనేది కేవలం ఉప్పు ద్వారా మాత్రమే రాదు. కాబట్టి.. ముఖ్యంగా కూరల్లో.. ఉప్పుకు బదులు ఇతర దినుసులు (నిమ్మరసం, వెనిగర్, కొత్తిమీర, పుదీనా, జిలకర పొడి, ధనియాల పొడి, పుట్టగొడుగుల పొడి, ఉల్లిపాయ పొడి, మొక్కల ఆకులు, మసాలాలు వంటివి) వేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. కూర వండేటప్పుడు కాకుండా తినేటప్పుడు చల్లుకుంటే ఉప్పు వాడకం తగ్గుతుందని సలహా ఇస్తున్నారు.
