- అఖిల భారత కోలీ సమాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్
నగర తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 58వ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి అఖిల భారత కోలీ సమాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ముదిరాజుల సంక్షేమంతో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆనాడే బీజం వేసిన మహోన్నత నాయకుడు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ అని కొనియాడారు. తన కుటుంబం గానీ, తన వ్యక్తిగత గొప్పతనం గానీ పట్టించుకోకుండా జీవితాంతం ముదిరాజ్ జాతి మరియు బహుజనుల అభివృద్ధినే లక్ష్యంగా సేవలందించిన మహనీయుడిగా ఆయనను ప్రశంసించారు.
కొరివి కృష్ణస్వామి వర్ధంతిని ముదిరాజ్ సమాజమే కాకుండా ఇతర సామాజిక వర్గాలవారు కూడా ఘనంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వర్ధంతి నిర్వహణకే పరిమితం కాకుండా, ఆయన చేసిన సేవలు, విశిష్టతలను నేటితరం యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కొరివి కృష్ణస్వామి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించడంతో పాటు, ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కాసాని వీరేష్ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయానికి కీర్తిశేషులు కొరివి కృష్ణస్వామి పేరును పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ ముదిరాజ్ మహాసభ నాయకులు పుట్టి రాజు, కాసాని సుధాకర్, ఎన్. సత్యనారాయణ, ఈటల భద్రయ్య, రావుల రాజశేఖర్, పిట్ల మోహన రాజ్, పిట్ల నాగేశ్, డా. వినోద్, శ్రీకాంత్, సురేందర్‌తో పాటు పలువురు ముదిరాజ్ సంఘ నేతలు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు.
