Friday, February 27, 2026
Homeజాతీయంనితిన్ నబిన్‌కు శుభాకాంక్షలు తెలిపిన డా. వకుళాభరణం కృష్ణమోహనరావు

నితిన్ నబిన్‌కు శుభాకాంక్షలు తెలిపిన డా. వకుళాభరణం కృష్ణమోహనరావు

బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన డా. వకుళాభరణం కృష్ణమోహనరావు భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్‌ను గురువారం నాడు న్యూఢిల్లీ దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహనరావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డా. వకుళాభరణం కృష్ణమోహనరావు రచించిన

- Advertisement -

‘సామాజిక న్యాయం–ఆర్థిక సమానత్వం–అభివృద్ధి దిశగా జీఎస్టీ సంస్కరణలు’ అనే పుస్తకాన్ని నితిన్ నబిన్‌కు అందజేశారు. ఈ గ్రంథాన్ని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో తీసుకువచ్చిన నిర్మాణాత్మక మార్పులు, ‘ఒక దేశం–ఒక మార్కెట్’ భావన ద్వారా సాధించిన జాతీయ సమగ్రత, అలాగే పేదలు, మధ్యతరగతి కుటుంబాలు సహా అన్ని వర్గాలకు అందుతున్న ప్రయోజనాలను ఈ పుస్తకం విశ్లేషిస్తుందని డా. వకుళాభరణం వివరించారు. పుస్తక రచనకు దోహదపడిన పరిశోధనా నేపథ్యం, సామాజిక న్యాయం – ఆర్థిక సమానత్వం మధ్య ఉన్న అనుబంధం, ప్రజా విధానాల రూపకల్పనలో జీఎస్టీ పాత్రపై నితిన్ నబిన్‌కు వివరంగా తెలియజేశారు. నితిన్ నబిన్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని డా. వకుళాభరణం కృష్ణమోహనరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News