Sunday, February 22, 2026
HomeసినిమాActress Pragathi | ఇప్పుడు పెళ్లిపై ఆసక్తి లేదు..

Actress Pragathi | ఇప్పుడు పెళ్లిపై ఆసక్తి లేదు..

  • నా మెచ్యూరిటీకి సరిపడే వ్యక్తి కావాలి
  • నటి ప్రగతి ఓపెన్ కామెంట్స్

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆపై తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్న ప్రగతి ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫిట్‌నెస్ ఐకాన్‌గా నిలుస్తున్నారు.ఇటీవల ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ప్రగతి, ఈ రూమర్స్‌పై స్పష్టత ఇచ్చారు.“జీవితంలో ఒక తోడు అవసరమే. కానీ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి మంచి వ్యక్తి అయి ఉండాలి. నా మెచ్యూరిటీ లెవల్‌కు సరిపడే వ్యక్తి దొరకకపోతే మళ్లీ కష్టమే అని అన్నారు.అలాగే పెళ్లి తర్వాత కట్టుబాట్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

పెళ్లయ్యాక ఇలా ఉండాలి, అలా చేయాలి అంటూ ఆంక్షలు పెడితే భరించలేను. 20 ఏళ్ల వయసులో ఉంటే సర్దుబాటు అయ్యేదాన్ని. ఇప్పుడు నా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ప్రస్తుతం పెళ్లిపై ఎలాంటి ఆశలు లేవు.. అని స్పష్టం చేశారు.ఇక తన పిల్లల గురించి మాట్లాడుతూ, కొడుకు బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడని, కూతురు అమెరికాలో చదువుకుంటోందని తెలిపారు.నా పిల్లలతో నేను ఫ్రెండ్‌లా ఉంటాను. సమాజానికి మంచి పిల్లలను ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది ..అని గర్వంగా చెప్పారు.ప్రస్తుతం నటి ప్రగతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News