పంచాయితీ ప్రథమ పౌరుడి పోరు ముగిసింది గెలిచినవారు విజయ గర్వం వీడి, అందరినీ కలుపుకొని ముందుకు నడవాలి. ఓడినవారు ఓటమి మీద కోపం మాని,ప్రజాతీర్పును గౌరవించాలి. నిన్నటి వరకు పోటీలు, వాదనలు, కోపతాపాల – ఇవన్నీ ఎల్లకాలం మంచివి కావు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఈ రోజు నుంచి ఊరంతా ఒకే కుటుంబంగా మెలగాలి. పల్లెల్లో ప్రశాంతతే పాలించాలి. విద్వేషాలకు కాదు.. వికాసానికి చోటు ఉండాలి. మన ఊరి అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సమిష్టిగా కదిలినప్పుడే పచ్చటి పల్లెలకు నిజమైన భవిష్యత్తు వస్తుంది. సర్పంచ్ఐరి-మన ఊరి భవితపైనే గురి కావాలి. శాంతి, ఐక్యత-మన నినాదం కావాలి.. ఊరూ మనదే, బాధ్యత మనదే సుమా..!
- మేదాజీ
- Advertisement -
