అర్జెంటీనా లెజెండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి మన దేశంలో అరుదైన గౌరవం లభించింది. అతని 70 అడుగుల విగ్రహాన్ని కోల్‌కతాలో ఏర్పాటుచేశారు. లేక్‌టౌన్‌లో పెట్టిన ఆ స్టాచ్యూని బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి మెస్సీ వర్చువల్‌గా ఆవిష్కరించాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మెస్సీ విగ్రహం కావటం విశేషం. విగ్రహ ఆవిష్కరణ అనంతరం మెస్సీ హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే సాల్ట్ లేక్ స్టేడియం నుంచి మెస్సీ తొందరగా వెళ్లిపోవటంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. పట్టరాని కోపంతో కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరారు. టెంట్లు, టెంపరరీ నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మెస్సీకి, ఆయన అభిమానులకు సారీ చెప్పారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా మెస్సీ మన దేశానికి వచ్చారు. రేపు (14న) ముంబైలో, ఎల్లుండి (15న) ఢిల్లీలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు.
Messi | కోల్‌కతాలో 70 అడుగుల విగ్రహం
- Advertisement -
RELATED ARTICLES
