- ‘ఆదాబ్ హైదరాబాద్’ కథనంపై ప్రభుత్వం స్పందన
- అనుమతిలేని నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు
- చెరువులోని బోర్ల తొలగింపు
- కబ్జాదారుడిపై పోలీసులకు ఫిర్యాదు
- ‘హైడ్రా’ దృష్టిసారించాలంటున్న సామాజికవేత్తలు
‘మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..’ అంటూ ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక(Aadab Hyderabad News Paper)లో వస్తున్న పలు కథనాలు (Stories) వాస్తవ రూపం దాలుస్తున్నాయి. సమాజంలో జరుగుతున్న ఎన్నో అక్రమాల(Irregularities)కు ‘ఆదాబ్’ చెక్ (Check) పెడుతోంది. ఈ క్రమంలో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ నెల 11న వెలువడిన సంచికలో ప్రచురించిన మరో కథనంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది.

‘రౌడీలతో రౌండ్ అప్ చేసి.. పట్టపగలే పెద్ద చెరువు కబ్జా’ అనే స్టోరీని సీరియస్(Serious)గా పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు (Higher Officials) తక్షణ చర్యలు చేపట్టారు. పెద్ద చెరువు(Pedda Cheruvu)లో మట్టి పోసి కబ్జా చేసిన కృష్ణంరాజు అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు (Police Complaint) చేస్తున్నట్లు చెప్పారు. ఆదాబ్ హైదరాబాద్ ప్రచురించిన ఆధారాల ప్రకారం ముందడుగేసిన అధికారులు అనుమతిలేని నిర్మాణాలను కూల్చివేశారు. చెరువులో వేసిన బోర్లను తొలగించారు. అంతేకాదు. ఈ అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన అధికారులపై విచారణకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద చెరువు కబ్జా వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక యాజమాన్యాన్ని స్థానికులు, సామాజికవేత్తలు అభినందిస్తున్నారు.
ఇప్పటికైనా ఈ కేసును హైడ్రా సీరియస్‌గా తీసుకోవాలని, చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని అవినీతి బాగోతాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తెస్తామని ఆదాబ్ హైదరాబాద్ చెబుతోంది. ఎక్కడ అక్రమం జరిగినా అక్కడ వాలిపోయి కలానికి పదును పెడతామని, వాస్తవాలను వెలుగులోకి తెస్తామని మరోసారి తెలిపింది. అమీన్‌పూర్ శివారులో అర్బన్ రైజ్ అనే నిర్మాణ సంస్థ ఎఫ్టీఎల్‌లో చేస్తున్న అక్రమాలను త్వరలో ప్రచురిస్తామని ధీమాగా ప్రకటించింది.
