తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ పర్యాటకుల కోసం పోటీ నిర్వహిస్తోంది. గెలిచినవారికి ప్రైజ్‌లు ఇవ్వనుంది. ఈ పోటీ పేరు.. ‘తెలంగాణలోని 100 వారాంతపు అద్భుతాలు’. ఈ పోటీలో పాల్గొనాలంటూ పర్యాటకులను, ఫొటోగ్రాఫర్లను, కంటెంట్ క్రియేటర్లను ఆహ్వానిస్తోంది. పోటీలో భాగంగా అద్భుతమైన ఫోటోలు, 60 సెకన్ల వీడియోలు తీసి పంపాలి. తద్వారా తెలంగాణలో దాగి ఉన్న అద్భుతమైన సందర్శనీయ ప్రదేశాలు వెలుగులోకి తేవాలని కోరుతోంది.

మొదటి బహుమతి రూ.50 వేలు, 2వ బహుమతి రూ.30 వేలు, 3వ బహుమతి రూ.20 వేలు ఇస్తారు. మరో 10 మంది విజేతలకు హరిత హోటల్స్‌లో 2 రోజులు/1 రాత్రి బస కల్పిస్తారు. థీమ్‌లు.. ప్రకృతి, వన్యప్రాణులు, వారసత్వం, సంస్కృతి, గ్రామీణ బసలు, ఆహార మార్గాలు(ఫుడ్ ట్రయల్స్), నీటి వనరులు, సాహస ప్రదేశాలు & మరిన్ని. ఎంట్రీలను 2026 జనవరి 5లోపు పంపాలి. తెలంగాణలో వారాంతపు అనుకూల గమ్యస్థానాన్ని హైలైట్ చేసేలా 3 ఫోటోలు + 1 వీడియో సమర్పించాలి.
విజేతలను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటిస్తారు. వివరాల కోసం tourism.telangana.gov.inను సందర్శించొచ్చు. ట్యాగ్ చేయాల్సిన అధికారిక హ్యాండిల్స్ & హ్యాష్ ట్యాగ్‌లు.. #100WeekendWonders #CaptureTheUnseen #HarithaHotels #TelanganaTourism TravelTelangana Telangana CMO
