- రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల..
- ప్రధాని మోదీతో భేటీ అనంతరం వెల్లడి
- ఆసియాలోనే ఇదే అతిపెద్ద పెట్టుబడి అన్న సత్య నాదెళ్ల..
- ఏఐ మౌలిక వసతులు, నైపుణ్యాల అభివృద్ధికి ఈ నిధుల కేటాయింపు
మైక్రోసాప్ట్ అధినేత సత్య నాదెళ్ల మంగళవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిన ఇండియాలో పెడుతున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇది భారతదేశ ఆశయాలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. భారతదేశ ఎఐ ఫప్ట్ ప్యూచర్‘ నిర్మించేందుకు, డెవలప్ చేసేందుకు శ్రీ17.5 బిలియన్లు అంటే రూ. 1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడిరచారు. భారతదేశం ఎఐ అవకాశంపై స్ఫూర్తిదాయకమైన సంభాషణలకు సత్యానాదెళ్ల ప్రధాని నరేంద్రమోడీకి థాంక్స్ చెప్పారు. ఆసియాలోనే మైక్రోసాప్ట్ అతిపెద్ద పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. మోడీతో విూటింగ్ గురించి నాదెళ్ల ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘భారతదేశ ఏఐ అవకాశంపై స్పూర్తిదాయకమైన సంభాషణలకు ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు, దేశ ఆశయాలకు మద్దతు ఇవ్వడానికి, ఇండియా ఏఐ ఫస్ట్ ఫ్యూచర్‌కు అవసరమైన మౌలికసదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి ఙాశ్రీ17.5 బిలియన్ల పెట్టుబడి నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని అన్నారు.గూగుల్, అమెజాన్ కూడా భారత్‌లో డేటా సెంటర్లు, ఏఐ హబ్‌ల ఏర్పాటులో బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించాయి. అక్టోబర్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఏపీలోని విశాఖపట్నంలో ఏఐ హబ్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను వెల్లడిరచారు.
ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాప్ట్ భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టనుంది. భారత్ తన ఏఐ లక్ష్యాలను చేరుకోవడానికి 17.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీతో మంగళవారం భేటీ అయిన ఆయన.. ఈ పెట్టుబడి గురించి ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. భారత్‌లో ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయక సంభాషణ తమ మధ్య జరిగిందని పేర్కొంటూ ప్రధాని మోదీతో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. దేశ ఏఐ ఆశయాలకు మద్దతుగా పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టనున్నట్లు సత్యానాదెళ్ల ప్రకటించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి అని పేర్కొన్నారు. భారత్‌లో కృత్రిమ మేధ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను అందించేందుకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు.
రాబోయే నాలుగేళ్లలో (2026`29) మధ్య ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నట్లు మైక్రోసాప్ట్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన 3 బిలియన్ డాలర్లకు ఈ పెట్టుబడి అదనమని తెలిపింది. మైక్రోసాప్ట్ పెట్టుబడి ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏఐ విషయంలో భారత్ పట్ల ప్రపంచం ఆశావాదంతో ఉందన్నారు. సత్యనాదెళ్లతో ఫలవంతమైన చర్చ జరిగిందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి గమ్యస్థానంగా భారత్‌ను ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ యువత ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందని, ఏఐ ఆపారశక్తిని సృజనాత్మకంగా ఉపయోగించుకుంటుందని ఆకాంక్షించారు.
