న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (New York Telangana Telugu Association-Nytta: నైట్ట) కొత్త కార్యవర్గాన్ని (New Executive Committee) ఇటీవల ఎన్నుకున్నారు. న్యూయార్క్‌లోని తెలుగు ప్రజలు (Telugu People) ఈ అసోసియేషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ కార్యవర్గం 2026వ సంవత్సరానికి పనిచేస్తుంది. నూతన అధ్యక్షుడిగా పాపులర్ ఫార్మసిస్ట్ (Popular Pharmacist) కోడెల రవీందర్ (Kodela Ravinder) వ్యవహరిస్తారు. ఈ సంఘం ఆరు సంవత్సరాల కిందట ఏర్పడింది. ప్రపంచ ఆర్థిక రాజధాని (Financial Capital Of The World) న్యూయార్క్‌లో తెలుగువారు, తెలంగాణ ప్రజలు వేలాదిగా ఉన్నారు. కొత్త అధ్యక్షుడు కోడెల రవీందర్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందినవారు.
- Advertisement -
