అయోధ్య మసీదు ప్రాజెక్టు 2026 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(Indo Islamic Cultural Foundation-IICF) చైర్మన్ యుఫార్ ఫారుఖి తెలిపారు. మసీదు సమస్య ఇటీవల రాజకీయంగా(Politically) చర్చనీయాంశంగా మారింది. హుమాయున్ కబీర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) వంటి నాయకులు చేస్తున్న ప్రకటనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
1992లో డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు(Babri Masjid)ను ఓ గుంపు కూల్చివేసి 33 ఏళ్లు అయిన నేపథ్యంలో.. ధన్నిపూర్‌లో కొత్త మసీదు ప్రాజెక్టు ప్రారంభానికి తాత్కాలిక ముహూర్తంగా 2026 ఏప్రిల్ తెర మీదికి వచ్చింది. ధన్నిపూర్ అనే గ్రామం అయోధ్యకు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. మసీదు సవరణ లేఔట్ ప్లాన్‌ను సంబంధిత ట్రస్ట్ డిసెంబర్ చివరి నాటికి సమర్పించాల్సి ఉంది. దీన్ని అయోధ్య అభివృద్ధి అథారిటీ(ADA) ఆమోదిస్తే నిర్మాణం పట్టాలెక్కుతుంది.
అయితే.. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ చుట్టూ వాదనలు, ప్రతివాదనలు కొనసాగుతున్నాయి.అయోధ్య జిల్లా యంత్రాంగం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారికంగా 5 ఎకరాల భూమిని కేటాయించిన 5 ఏళ్లు దాటినా అసలు మసీదు ప్రణాళికపై అనిశ్చితులు ఇంకా అలాగే ఉన్నాయి. ‘మొదటి మసీదు లేఔట్ ప్లాన్‌ను ADA తిరస్కరించింది. కానీ.. అంతకుముందే.. దాని ఆధునిక డిజైన్‌పై సమాజం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీంతో.. దాన్ని వదిలివేయాలని IICF నిర్ణయించింది. మరింత సాంప్రదాయకమైనదాన్ని ఎంచుకుంది. ఇది దాదాపు సిద్ధంగా ఉంది. మసీదు నిర్మాణం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇది ప్రారంభం కావడంలో ADA ఆమోదం కీలకమైన మొదటి అడుగు. కానీ.. ధన్నిపూర్ స్థలంలో, చుట్టుపక్కల తగినంత భూమి లేకపోవడంసహా IICF ఇతర సమస్యలను ఎదుర్కొంటోంది.
