Thursday, March 26, 2026
Homeమహబూబ్‌నగర్‌Victory | పెద్దగూడెం గ్రామంలో బిజెపి జెండా ఎగరడం ఖాయం.

Victory | పెద్దగూడెం గ్రామంలో బిజెపి జెండా ఎగరడం ఖాయం.

  • జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ..

వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామపంచాయతీ పై బిజెపి జెండా ఎగరడం ఖాయమని జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. గురువారం అధ్యక్షులు నారాయణ నాయకత్వంలో, మండల ఉపాధ్యక్షులు కొట్ర రాజేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి తోకల తిరుపతయ్య తన అనుచరులతో కలిసి బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దుప్పల్లి నారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. తిరుపతయ్య పార్టీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్ లోక్ నాథ్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, మండల అధ్యక్షుడు సంద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News