Tuesday, March 3, 2026
Homeఆంధ్రప్రదేశ్Janasena Party | పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించొద్దు

Janasena Party | పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించొద్దు

ఏపీ డిప్యూటీ సీఎం (Ap Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల చేసిన వ్యాఖ్యలు (Comments On Division of State) వివాదాస్పదం కావటంతో ఆయన పార్టీ జనసేన (Janasena Party) స్పందించింది. మాటలను వక్రీకరించొద్దని కోరింది. ‘రాజోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల(ఏపీ, తెలంగాణ) మధ్య మంచి వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలను వక్రీకరించొద్దు’ అని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది.

కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లకు దిష్టి తగిలినట్లుంది.. ఈ ప్రాంతం నిత్యం పచ్చగా ఉంటుందని తెలంగాణవాళ్లు అంటుంటారు.. గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా భాసిల్లుతున్నాయి.. రాష్ట్రం విడిపోవడానికి కారణం వీటి పచ్చదనమే.. అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌పై తెలంగాణ (Telangana) నుంచి తీవ్ర ఆగ్రం వ్యక్తమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. దీంతో.. వివాదం పెద్దది కాకుండా చూసేందుకు, నష్టనివారణ కోసం జనసేన పార్టీ రంగంలోకి దిగినట్లు పరిశీలికులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News