ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఐ అండ్ పీఆర్ ఆఫీస్ వద్ద కార్యక్రమం
వనపర్తి, డిసెంబర్ 2(ఆదాబ్ హైదరాబాద్): జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి(Solve Problems) టీయూడబ్ల్యూజే(ఐజేయూ) (TUWUJ-IJU) ఆధ్వర్యంలో ఈ నెల 3న (బుధవారం) జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్(Telangana Electronic Media Association) పాలమూరు జిల్లా కన్వీనర్(Palamuru District Convener) అహ్మద్ పాషా కోరారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్ కార్యాలయం వద్ద తలపెట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన అక్రిడేషన్లు (Accreditations) ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
హెల్త్ కార్డుల(Health Cards) అంశం కూడా మరిచిపోయిందని, అక్రిడేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య భీమా పథకాన్ని వెంటనే పునరుద్దరించాలని అన్నారు. జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సీఎం, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోరాటంతోనే హక్కులు సాధించుకునేందుకు రాష్ట్ర నాయకత్వం మహాధర్నాకు పిలుపునిచ్చిందని తెలిపారు. ఐ & పిఆర్ కమిషనర్ కార్యాలయం(Office of the Commissioner of I & PR) వద్ద చేపడుతున్న మహాధర్నాకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
