Wednesday, March 4, 2026
Homeమెదక్‌BRS | వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన

BRS | వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన

  • కుచారం మొద్దు మహేందర్

గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో కూచారం గ్రామ మొద్దు మహేందర్ గ్రామ యువకులతో మరియు కూచారం బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.మొద్దు సౌమ్య మహేందర్ ను కూచారం బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు,ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మొద్దు సౌమ్య మహేందర్ ను కూచారం గ్రామ సర్పంచిగా గెలిపించాలని ప్రజలకు యువకులకు మహిళలకు పిలుపునిచ్చారు.

కూచారం గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, కూచారం గ్రామ యువకులకు ఎలాంటి అవసరం ఉన్న తాను అండగా ఉంటానని, రాబోవు రోజుల్లో గ్రామ యువతకు వివిధ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్,ఉదయ్ గౌడ్, నందు గౌడ్, వీరేశ్ గౌడ్, రాజు నాయక్,శింపుల మురళి, యవపురం కృష్ణ, వెంకటపురం శ్రీకాంత్, వడ్డే యాదగిరి, నారం జగపతి,తొంట స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News