కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాల(Pending Issues)పై రాష్ట్ర ఎంపీల(MPs)తో డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) ప్రజాభవన్(PrajaBhavan)లో సమీక్షా సమావేశం(Reveiw Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్ని పార్టీల ఎంపీలతో భేటీ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు(BC Reservations Bill) ఆమోదం కోసం 9వ షెడ్యూల్‌లో సవరణ అత్యవసరమని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ద్వారా లేదా ప్రశ్నోత్తరాల్లో బలంగా వినిపించాలని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలు, మంత్రివర్గంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
భట్టి విక్రమార్క ఇంకా ఏమన్నారంటే..
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని తక్షణం అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశాం.
- విద్యుత్, నీటి పారుదల, GST తదితర శాఖల పెండింగ్ నిధుల వివరాలు అక్కడ సిద్ధంగా ఉంటాయి.
- డిసెంబర్ 9న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకోనున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలు, Vision 2047 డాక్యుమెంట్‌ను విడుదల చేస్తున్నాం.
- 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునే ప్రణాళికను కూడా సమగ్రంగా సిద్ధం చేశాం.
- గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన కమిటీల్లో ఆసక్తి ఉన్న ఎంపీలు చేరాలి.
- కేంద్రానికి సంబంధించిన 12 శాఖలపై 47 పెండింగ్ అంశాలను గుర్తించి, సెమీకండక్టర్ రంగంపైన కూడా చర్చించారు.
