Wednesday, February 11, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంZonal Officer | నా జోన్ కు నేనే రాణి నేనే మంత్రి..?

Zonal Officer | నా జోన్ కు నేనే రాణి నేనే మంత్రి..?

  • ఎస్సీ గురుకుల జోనల్ అధికారిణి ఇష్టరాజ్యం..
  • జోనల్ అధికారి సొంత నిర్ణయంతో చిరు ఉద్యోగి భర్త మృతి..
  • రోడ్డున పడ్డ కుటుంబానికి న్యాయం చేయాలి..
  • మంత్రి, కలెక్టర్, చెప్పడంతోనే సీనియర్ ఉద్యోగిని వేరే జిల్లాకు పంపించినం..
  • అదే మంత్రి, కలెక్టర్ ఆమెకు న్యాయం చేయండి, అని చెప్పిన లెక్కచేయని జోనల్ అధికారులు..
  • విద్యారాణి, అరుణకుమారిల మధ్య నలిగిపోయిన చిరు ఉద్యోగి కుటుంబం..

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్సీ గురుకులాల జోనల్ అధికారి (ఆర్సీఓ) వ్యవహారశైలి ప్రస్తుతం జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వంటి ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలను సైతం ఏ మాత్రం లెక్కచేయకుండా, పూర్తి నిరంకుశంగా, గుత్తాధిపత్య ధోరణిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఆమె తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ఓ చిరు ఉద్యోగి కుటుంబం రోడ్డున పడటం, ఆఅధికారిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోక “పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాధారణంగా ప్రభుత్వ అధికారులు ప్రజలకు, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. కానీ, సదరు జోనల్ అధికారి విషయంలో అది పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆమె ఫోన్లలో వినిపించకపోవడం, కార్యాలయానికి సైతం సరిగా హాజరు కాకపోవడంతో, ఉమ్మడి జిల్లాలోని గురుకుల వ్యవస్థకు, దాని సమస్యలకు అసలు అధికారి ఎవరనే గందరగోళం నెలకొంది. “నా జోనలకు నేనే రాని, నేనే మంత్రి” అన్నట్టుగా వ్యవహరిస్తూ, ఉన్నతాధికారుల నియంత్రణకు తావు లేకుండా పోయిందని ఉద్యోగ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.ఒత్తిడితో కుటుంబం..

- Advertisement -

భర్త మృతితో చిన్నభిన్నం.. బలైన ఆర్సీఓ నిరంకుశత్వానికి తాజాగా ఓ చిరు మహిళా ఉద్యోగిని కుటుంబం బలైపోయింది. పై అధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే, కేవలం వ్యక్తిగత ఇష్టానుసారం ఆ మహిళా ఉద్యోగినిని సుదూర ప్రాంతానికి బలవంతంగా బదిలీ చేశారు. అన్యాయమైన ఈ బదిలీతో ఆ ఉద్యోగిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. దీంతో కుటుంబ పోషణ, ఉద్యోగ భద్రతకు సంబంధించిన సమస్యలను తట్టుకోలేకపోయిన ఆమె భర్త, ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆదరణ కోల్పోయి, పిల్లలతో రోడ్డున పడిన ఆ మహిళా ఉద్యోగిని దుస్థితిని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

కలెక్టర్ ఆదేశించినా కదలిక లేదు!

ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించారు. ఆ మహిళకు అన్యాయం జరగకుండా చూడాలని, ఆమె పాత స్థానాన్ని ఆమెకే తిరిగి కేటాయించాలని జోనల్ అధికారిని స్పష్టంగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, బదిలీని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, జోనల్ అధికారి మాత్రం వాటిని పూర్తిగా బేఖాతరు చేస్తూ, తన పంథాలోనే వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం ఆదేశాలను కూడా లెక్కచేయని అధికారిపై చర్యలు తీసుకోకపోవడం వ్యవస్థ పనితీరునే ప్రశ్నార్థకం చేస్తోంది. జోనల్ అధికారిణి విద్యా రాణిని చరవాణి లో వివరణ కోరగా..

మా అత్తగారు చనిపోయారని నేను పదిహేను రోజుల సెలవు లో వున్నానని, కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యేలు, ఆదేశాలు ఇచ్చింది వాస్తవమే కానీ నా చేతిలో ఏమీ లేదు పై అధికారుల కి కలవమని చెప్పడం జరిగిందని తెలిపారు. జోనల్ అధికారిగా గతంలో చేసే దంతా చేసి s మహిళ కుటుంబాన్ని రోడ్డున పడేసి ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు అంటూ ఈమె స్థానంలో వేరే మహిళని కేటాయించే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందనేది మిగిలిపోయిన ప్రశ్న.. ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తూ, ఉద్యోగుల కుటుంబాల పాలిట శాపంగా మారిన ಜಿಲ್ಲಾ అధికారి పై యంత్రాంగం తక్షణమే దృష్టి సారించాలి. బదిలీని రద్దు చేసి, బాధిత మహిళా ఉద్యోగినికి న్యాయం చేయాలని, ఈ నిరంకుశ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, వివిధ సంఘాల నాయకులు ముక్తకంఠంతో తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News