మరోసారి భారీ విరాళం ఇచ్చిన ప్రవాస భారతీయుడు
ప్రవాస భారతీయుడు (NRI) మంతెన రామలింగరాజు (Manthena Ramalingaraju) తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)కి మరోసారి భారీ విరాళం (Donation) ఇచ్చాడు. 13 ఏళ్ల కిందట రూ.16 కోట్ల విరాళం ఇచ్చిన ఆయన తాజాగా రూ.9 కోట్లు అందజేశారు. తిరుమలలోని పీఏసీ(PAC)లోని ఒకటీ రెండు మూడు భవనాల ఆధునికీకరణ కోసం ఈ నిధులు డొనేట్ చేశారు.
- Advertisement -
తన బిడ్డ నేత్, అల్లుడు వంశీ పేరిట సమర్పించారు. సామాన్య భక్తుల(Devotees)కు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతోనే వీటిని ఇస్తున్నట్లు వివరించారు. ఆయనను టీటీడీ చైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు (BR Naidu) అభినందించారు. ముందు ముందు మరిన్ని విరాళాలను దాత అందజేస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -
