Saturday, March 7, 2026
Homeనిజామాబాద్‌Pocharam | రుణాల రాయితీ పంపిణీ

Pocharam | రుణాల రాయితీ పంపిణీ

బాన్సువాడ పట్టణ (Bansuada Town) కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే (MLA) పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీ(Interest-free loan concession)ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు కూడా అయిన పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ (Agros Chairman) కాసుల బాలరాజు(Kasula Balaraju), బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 3465 మహిళా సంఘాలకు 3 కోట్ల 60 లక్షల రూపాయల వడ్డీలేని రుణ రాయితీ చెక్కును మహిళా సంఘాలకు పోచారం అందజేశారు. బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News